సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి బ్యాంకులు చక్కటి సహకారం అందించాయని సీఎం జగన్ ప్రశంసించారు. వివిధ పథకాల కింద సాఫీగా నగదు బదిలీ చేయగలిగామని అన్నారు. దాదాపు రూ.15 వేల కోట్లకుపైగా సొమ్మును నగదు బదిలీ ద్వారా ఇచ్చినట్లు వెల్లడించారు. 'అమ్మఒడి' కింద ఈ నెలలో రూ.6,500 కోట్లు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. కౌలురైతుల విషయంలో లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వట్లేదని బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: