ETV Bharat / city

CM Jagan: మార్చి 31 కల్లా అన్ని రోడ్లను బాగుచేయాలని సీఎం ఆదేశం - ఏపీ తాజా వార్తలు

CM Jagan review: రహదారుల మరమ్మతులపై సీఎం జగన్‌ మరోసారి అధికారులకు తాజా లక్ష్యాన్ని నిర్దేశించారు. మార్చి 31 కల్లా అన్ని రోడ్లను బాగుచేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు.

CM Jagan
రోడ్ల మరమ్మతులపై సీఎం జగన్​ రివ్యూ
author img

By

Published : Oct 7, 2022, 6:55 PM IST

CM Jagan review: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. నగరాల్లో పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు అంశాలపై సీఎం సమీక్షించారు. టిడ్కో ఇళ్లు, అర్భన్ క్లినిక్స్‌, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ తదితర అంశాల పురోగతిపైనా సమీక్షలో చర్చించారు. వర్షాల నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించి పనులు మొదలు పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. మార్చి 31 కల్లా అన్ని రోడ్లనూ మళ్లీ బాగుచేయాలని సూచించారు. గార్బేజ్‌ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏమాత్రం ఉండకూడదని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలోనూ వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ పర్యవేక్షించాలని ఆదేశించారు.

మున్సిపాల్టీల వారీగా చెత్త, మురుగునీటి శుద్ధి చేసే ప్రక్రియలో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు, అదనపు వనరులపై నివేదిక రూపొందించాలని సీఎం జగన్​ చెప్పారు. కృష్ణానది రిటైనింగ్‌ వాల్‌ వద్ద మురుగునీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రిటైనింగ్‌ వాల్‌ బండ్‌ను చెట్లు, విద్యుత్‌ దీపాలు, ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు. ప్లాస్టిక్‌ ప్లెక్సీల నిషేధం అమలుకు సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్‌ నుంచి క్లాత్‌ బ్యానర్లు వైపు మళ్లడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. జగనన్న కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్​పోర్టుకు వెళ్లే రహదారికి ఇరువైపులా సుందరీకరణ పనులపై అధికారులు వివరాలు సీఎంకు అందించారు. విశాఖపట్నంలో సుందరీకరణ పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమంపై శ్రద్ధపెట్టాలని సూచించారు. అర్బన్‌ ప్రాంతాల్లో వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపైనా సీఎం సమీక్షించారు.

"వర్షాల దృష్ట్యా నగరాలు, పట్టణాల్లో రోడ్లు పరిశీలించాలి. మార్చి 31 నాటికి అన్ని రోడ్లనూ మరోసారి బాగుచేయాలి. గార్బేజ్‌ స్టేషన్లతో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదు. కృష్ణానది రిటైనింగ్‌ వాల్‌ వద్ద మురుగునీరు చేరకుండా చూడాలి. కృష్ణానది రిటైనింగ్‌ వాల్‌ బండ్‌ను అందంగా తీర్చిదిద్దాలి. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధంపై వ్యాపారులతో కలెక్టర్లు మాట్లాడాలి. క్లాత్‌ బ్యానర్లు వైపు మళ్లేందుకు కలెక్టర్లు చర్యలు చేపట్టాలి. విశాఖలో సుందరీకరణ పనులు చేపట్టాలి." -సీఎం జగన్​

రాష్ట్రానికి 11 అవార్డులు: 'అజాది కా అమృత్‌ మహోత్సవ్‌' కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో ఆంధ్రప్రదేశ్‌ 11 అవార్డులు గెల్చుకుంది. స్వచ్చ సర్వేక్షణ్‌– 2022 అవార్డులు పొందిన కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాల్టీల ఛైర్మన్లు, కమిషనర్లు... ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. అవార్డులు పొందిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను సీఎం అభినందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.