ETV Bharat / city

'వైఎస్‌ఆర్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలి' - houses for poor in andhra pradesh latest news

వైఎస్​ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్లు నిర్మాణానికి సంబంధించి.. లబ్ధిదారులు మూడు ఆప్షన్లలో ఏ ఆప్షన్‌ ఎంచుకున్నా.. సబ్సిడీపై సిమెంటు, స్టీల్‌ను అందించాలని సూచించారు. వైఎస్​ఆర్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. కాలనీల్లో సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. అందంగా, అహ్లదంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్​ స్పష్టం చేశారు.

cm jagan review on housing in andhra pradesh

author img

By

Published : Feb 18, 2021, 5:33 PM IST

Updated : Feb 19, 2021, 6:42 AM IST

పేదలకు ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్లు, మౌలిక వసతులపై చర్చించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ వేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఏయే సమయాల్లో ఎంత నిధులు విడుదల చేయాలన్నదానిపై ఒక ప్రణాళిక వేయాలన్నారు. దీనివల్ల పేదలకు ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయన్నారు. తొలివిడతలో దాదాపు రూ.15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ చేయాలన్నారు.

ఏ అప్షన్ ఎంచుకున్నా సరే..

ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికి 83 శాతం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా.. సబ్సిడీపై సిమెంటు, స్టీల్‌ను అందించాలని సీఎం ఆదేశించారు.

మంచి జీవన ప్రమాణాలు అందాలి..

వైఎస్​ఆర్​ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, సుందరీకరణపైనా చర్చించారు. వైఎస్​ఆర్ జగనన్న కాలనీల్లో ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలని సీఎం పేర్కొన్నారు. కాలనీల్లో జనాభాకు తగినట్టుగా రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. కాలనీల డిజైనింగ్, మౌలిక సదుపాయాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు ఉంటే.. కచ్చితంగా తీసుకోవాలన్నారు. కొత్తగా నిర్మాణం కానున్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్‌వాడీ ఉండాలని, ప్రతి 1500 నుంచి 5వేల ఇళ్లకు లైబ్రరీ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. కాలనీల్లో పార్కులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

నిర్మాణం అవుతున్నప్పుడే చెట్లు నాటాలి..

అలాగే పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలన్న దానిపై సీఎం సమీక్షించారు. కాలనీల డిజైన్లను పరిశీలించిన సీఎం... రోడ్ల నిర్మాణం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కాలనీల్లో మొక్కలు నాటే విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. కాలనీలు నిర్మాణం అవుతున్నప్పుడే చెట్లను నాటడానికి మార్కింగ్‌ చేయాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి:

నామినేషన్ల బలవంతపు ఉపసంహరణపై నివేదికలు ఇవ్వండి: ఎస్​ఈసీ

Last Updated : Feb 19, 2021, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.