ఈ- ప్రొక్యూర్‌మెంట్ కాంట్రాక్టులపై... మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 100 కోట్లు పైబడ్డ కాంట్రాక్టు పనులను.. . ముందస్తు న్యాయసమీక్షకు నివేదించడం ద్వారా దేశంలో అత్యుత్తమ పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టామని సీఎం చెప్పారు. రివర్స్ టెండరింగ్‌ను మరింత బలోపేతం చేయాలని కనీసం ఐదుగురు లేదా.. బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60శాతం మందికే రివర్స్‌టెండరింగ్‌కు అర్హులయ్యేలా చూడాలన్నారు. బిడ్డింగ్‌లో 10 మంది పాల్గొంటే అందులో ఎల్1 నుంచి ఎల్6 వరకూ అవకాశమివ్వాలన్నారు. రివర్స్ టెండరింగ్‌లో మరింత పోటీకి ఉపయోగపడుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ పనులు,కొనుగోళ్ల విషయంలోనూ ఈ సంస్కరణలు తీసుకురావలని సూచించారు.
తక్కువ కోట్ వివరాలు సైట్‌లో
ప్రభుత్వ పనులు, సర్వీసులు, కాంట్రాక్టుల్లో పారదర్శకత తీసుకొచ్చేలా ఒక పాలసీ తీసుకురావాలని సీఎం ఆదేశించారు. టెండర్లలో ఎక్కువమంది పాల్గొనేలా ఈ విధానం ఉండాలన్నారు. టెండర్లలో పాల్గొనలంటే ఎవరికైనా నిరుత్సాహం కలిగించే పరిస్థితి ఉండకూడదని సీఎం స్పష్టంచేశారు. తక్కువ ధరకు కోట్ చేసిన టెండర్ వివరాలను..ఈ- ప్రొక్యూర్‌మెంట్ సైట్‌లో పెట్టాలని..ఆ తర్వాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎం సూచించారు.
జనవరి 1 నుంచి కొత్త పాలసీ
రూ.10 లక్షలు అంతకన్నా ఎక్కువ విలువైన పనులు, కొనుగోళ్లలో..ఓ విధానమంటూ లేదని సీఎం దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో వినియోగించని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వపరంగా చేస్తున్న కొనుగోళ్లు, అప్పగిస్తున్న సర్వీసులు, పనులు విషయంలో జాబితా తయారుచేయాలని సీఎం ఆదేశించారు. పారదర్శకతకు ప్రాధాన్యం వేసేలా జనవరి 1 నుంచి కొత్తపాలసీ అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఈ-–ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు.
పనులు సాఫీగా జరిగేందుకు అధికారి నియామకం
ప్రభుత్వ పనులు, కొనుగోళ్ల టెండర్లలో ఈ- ప్రొక్యూర్‌మెంట్, జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ పనులు సాఫీగా జరిగేలా సహకారం అందించేందుకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎం నిర్ణయించారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సాఫీగా చూడాల్సిన బాధ్యత ఈ అధికారిదని స్పష్టం చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూకు టెండర్ పంపగానే సంబంధిత శాఖ అధికారి వెళ్లి న్యాయమూర్తికి వివరించాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు.
ఇదీ చదవండి :