రాష్ట్రంలోని ఆస్పత్రులు, కొవిడ్ కేంద్రాల్లో ఆహారం, పారిశుద్ధ్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆహారం మెనూ కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. టెలీమెడిసిన్ కింద మందులు తీసుకున్న వారి పరిస్థితిపై ఆరా తీయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
కరోనా క్లస్టర్లలోనే 85 నుంచి 90 శాతం వరకు పరీక్షలు జరిగేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. 104, 14410 కాల్ సెంటర్లు బాగా పని చేయాలన్న జగన్... నంబర్ల పనితీరును అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. కాల్ సెంటర్ సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసేలా పనిచేయాలని సూచించారు. కొవిడ్ ఆస్పత్రుల సేవలపైనా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్న సీఎం... ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు.
ఇదీ చదవండీ... 'ప్రజలకు వైద్యం అందనప్పుడు- ప్రభుత్వం ఉండి ఏం లాభం'