కొవిడ్-19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని అధికారులు సీఎంకు వివరాలు అందించారు. మరో 4, 5 రోజుల్లో కరోనా పరీక్షల రోజువారీ సామర్థ్యాన్ని 2 వేల నుంచి 4 వేలకు పెంచుతామని సీఎంకు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 2100కు పైగా పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ట్రూనాట్ పరికరాలతో పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి అధికారులు తెలిపారు.
32 వేల మందికి కరోనా పరీక్షలు
కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన 32 వేలమందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్ పరీక్షలు చేయాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలపై సీఎం ఆరా తీశారు. మెడికల్ ప్రొటోకాల్ పూర్తిచేసుకున్న పేదలను ఇళ్లకు పంపేటప్పుడు కనీసం రూ.2 వేలు ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. ఇంటికి వెళ్లిన తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాలన్నారు. అత్యవసర సేవలందిస్తున్న వారి ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్తలు వహించాలన్నారు. అరటి, పుచ్చ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలన్న సీఎం.. రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వంటనూనెల ధరల పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: