రాష్ట్రంలో కొవిడ్ - 19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకూ 80,334 కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1,504 చొప్పున పరీక్షలు చేయిస్తున్నామన్నారు. దేశంలోనే అధిక సగటుతో పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ప్రథమ స్థానంలో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కేసులన్నీ కూడా కంటైన్మెంట్ జోన్ల నుంచే వస్తున్నాయన్నారు. టెలీమెడిసిన్‌లో మందులు సరఫరా చేసే విధానం సమర్థంగా ఉండాలని సీఎం జగన్ నిర్దేశించారు.
ఎగుమతులపై సీఎం ఆరా
రాష్ట్రంలోని వివిధ పంటల మార్కెటింగ్, ధరలు అంశాలపై సీఎం అధికారులతో సమీక్షించారు. మొక్కజొన్న, శెనగ, ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. బత్తాయి, అరటి రైతుల సమస్యలపైనా చర్చించారు. అన్నదాతలకు ఇబ్బంది లేకుండా అవసరమైనచోట మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకుంటోందని అధికారులు సీఎంకు తెలిపారు. ఎగుమతులు, ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లలో విక్రయాలు, ధరలపై ఆరా తీసిన సీఎం... వీటి సమాచారంతో ప్రతిరోజూ సమీక్షా సమావేశానికి రావాలని ఆదేశాలిచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులన్నీ బయట రాష్ట్రాలకు ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. రైతుల ఇబ్బందులపై వెంటనే జోక్యం చేసుకోవాలని, వారిని ఆదుకునే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: