ETV Bharat / city

'ఆరోగ్య ఆసరా పథకంలో ఎలాంటి ఇబ్బందులుండొద్దు'

ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలపై అధికారులను ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

cm jagan
cm jagan
author img

By

Published : May 13, 2020, 3:46 PM IST

ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కరోనా నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్​ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షలకుపైగా కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఏ లోటూ లేకుండా అత్యవసర సేవలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. అవసరమైన వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కొత్తగా పెట్టిన ఈ కార్యక్రమం అమల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలోని ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించినట్లు చెప్పారు. బిల్లుల చెల్లింపులో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. టెలి మెడిసిన్‌ కోసం కొత్త బైకులను కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

స్థానికంగానే విక్రయాలు

రాష్ట్రంలో స్థానికంగానే చేపలు, రొయ్యలను విక్రయించేలా చూడాలని సీఎం జగన్ అన్నారు. దీని కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కనీసం 30 శాతం స్థానికంగా వినియోగం ఉండేలా చూడాలని చెప్పారు. చేపలకు ధర, మార్కెటింగ్‌ విషయాల్లో చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవిని సీఎం ఆదేశించారు. రాయలసీమ తదితర జిల్లాలలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమోటాలకు మరింత మార్కెటింగ్ కల్పించాలని సూచించారు.

ఇదీ చదవండి :

ఆసుపత్రికి వెళ్లాలంటే.. డోలీ ఎక్కాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.