ETV Bharat / city

CM Jagan Review: 'బ్లాక్‌ ఫంగస్‌ నివారణ ఇంజక్షన్లు, మందులు ఎక్కడున్నా సేకరించాలి' - Jagan

కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారికి ఏ లోటూ రాకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ సేవల్లో ఏ మాత్రం లోపం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ నివారణ ఇంజెక్షన్లు, మందులు ఎక్కడున్నా సేకరించాలని సూచించారు. కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

సీఎం జగన్
సీఎం జగన్
author img

By

Published : Jun 3, 2021, 8:37 PM IST

కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌(vaccine)పై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారికి ఏ లోటూ రాకూడదని స్పష్టం చేశారు. ఎక్కువమంది కొవిడ్ రోగులు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నారన్న సీఎం... ఆరోగ్యశ్రీ సేవల్లో ఏ మాత్రం లోపం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ నివారణ ఇంజక్షన్లు, మందులు ఎక్కడున్నా సేకరించాలని సూచించారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రతినెలా ఆర్థిక సాయం అందాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలను ఎక్కువ వడ్డీ వచ్చే చోట డిపాజిట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని సీఎంకు తెలిపారు. క్లిష్ట సమస్యలు వస్తున్నా కేసుల సంఖ్య కూడా తగ్గుతోందని.. కొవిడ్‌ నుంచి కోలుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోందని ముఖ్యమంత్రికి వివరించారు. 7,270 ఆక్సిజన్ బెడ్లు, 11,708 సాధారణ బెడ్లు ఖాళీగా ఉన్నాయని.. రాష్ట్రంలో ఇప్పటివరకు 51 లక్షల మందికి తొలి డోస్ టీకా ఇచ్చామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 25 లక్షల మందికి పైగా 2 డోసుల కొవిడ్‌ టీకా ఇచ్చామని... జూన్‌ నెలకు కేంద్రం సుమారు 37 లక్షల టీకాలు కేటాయించిందని వివరించారు.

ఇదీ చదవండీ... AP Executive Capital: విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి తీరుతాం: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.