శ్రీకాకుళం జిల్లాలో అమలవుతున్న నాణ్యమైన బియ్యం పంపిణీ పథకం తీరుపై.. ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. మంత్రి కొడాలి నానితో పాటు.. పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీకి చేస్తున్న సన్నాహాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన బియ్యం పంపిణీపై శ్రీకాకుళం జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యం సేకరించేలా ప్రణాళిక వేసుకోవాలన్న ముఖ్యమంత్రి... బియ్యం సరఫరా సంచులను రీసైక్లింగ్ చేసుకునేలా చూడాలన్నారు. డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: