ETV Bharat / city

'పెద్ద ఎత్తున క్వారంటైన్ కేంద్రాలు సిద్ధం చేయండి' - ఏపీ కరోనా వైరస్ వార్తలు

కరోనా నివారణ, లాక్‌డౌన్ ప్రభావం, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్.. మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న వారికి స్క్రీనింగ్ టెస్టులు చేసి... అవసరం అనుకుంటే క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలన్నారు. క్వారంటైన్​లో సదుపాయాలపై సీఎం ఆరా తీశారు. ఇంటింటా సర్వే గుర్తించిన వారిలో హైరిస్క్ ఉన్నవారికి ముదస్తు వైద్యం అందిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. కృష్ణా జిల్లాలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఆరా తీసిన సీఎం.. బస్తాకు కొంత ధాన్యం మినహాయింపుపై చర్యలు తీసుకోవాలన్నారు.

కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష
కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష
author img

By

Published : May 1, 2020, 1:08 PM IST

Updated : May 1, 2020, 5:18 PM IST

కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. లాక్‌డౌన్‌ సడలింపు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపట్ల తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆరా తీశారు. విదేశాలు, రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్న సీఎం.. స్క్రీనింగ్‌ సహా అవసరమైన వారిని క్వారంటైన్ చేసే అంశంపై చర్చించారు. అనుసరించాల్సిన విధానంపై ప్రణాళిక రూపొందించాలన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎప్పటికప్పుడూ పరిశీలన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ముందస్తు వైద్యం...

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,00,997 కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. నిన్న ఒక్కరోజే 7,902 పరీక్షలు చేసినట్లు తెలిపిన అధికారులు.. కుటుంబ సర్వేలో గుర్తించి పరీక్షలు పూర్తిచేసినట్లు వివరణ ఇచ్చారు. మిగిలిన వారికి 2-3 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామన్నారు. వీరిలో 4 వేలమందిని హైరిస్క్‌ ఉన్నవారిగా గుర్తించినట్లు తెలిపిన అధికారులు.. పరీక్షలు చేసి కరోనా లక్షణాలున్న వారికి ముందస్తు వైద్యం అందిస్తామన్నారు.

ధాన్యం సేకరణపై ఆరా...

ధాన్యం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. కృష్ణా జిల్లాలో రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సమావేశంలో సీఎం ఆరా తీశారు. ధాన్యం సేకరణలో బస్తాకు కొంత ధాన్యం మినహాయింపుపై ఫిర్యాదులపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం, సీఎస్‌, డీజీపీ వంటి వ్యక్తులంతా కృష్ణా జిల్లాలో ఉన్నారన్న జగన్‌.. అందరూ ఉన్నా జిల్లాలో ఇలాంటి ఘటనలు సరికాదన్నారు. వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవద్దని అధికారులను ఆదేశించారు. పంటలను రోడ్డుపై పారబోసే ఘటనలు కనిపించడానికి వీల్లేదని సీఎం అన్నారు. చీనీ, అరటి, టమాట, మామిడి ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై దృష్టి పెట్టాలన్నారు. వచ్చే ఏడాది ఈ పంటల విషయంలో మార్కెటింగ్‌ సమస్యలు రాకూడదన్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

Last Updated : May 1, 2020, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.