ETV Bharat / city

మరో 13 శాతం మద్యం దుకాణాలు తగ్గిస్తాం : సీఎం - సీఎం జగన్ తాజా వార్తలు

కరోనాతో కలిసి జీవించాలన్నది వాస్తవమని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే జీవనం సాగించాలన్నారు. కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్షించారు. నిర్ధరణ పరీక్షల్లో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందని చెప్పారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి లక్షల్లో వచ్చే వారికోసం క్వారంటైన్​ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 10 మందికి సరిపడా క్వారంటైన్ సదుపాయం ఉండాలన్నారు. మద్యం ధరలు చూస్తే షాక్​ కొట్టేలా ఉండాలనే 75శాతం పెంచామని సీఎం అన్నారు.

cm jagan
cm jagan
author img

By

Published : May 5, 2020, 2:15 PM IST

Updated : May 6, 2020, 6:55 AM IST

మద్యం ధరలు షాక్‌ కొట్టేలా ఉండేందుకే 75 శాతం పెంచామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. క్రమంగా విక్రయాలూ తగ్గిస్తామన్నారు. తాగునీరు, నాడు- నేడు కింద చేపట్టిన కార్యక్రమాల పురోగతి, గృహనిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాలు, ఉపాధి హామీ, కొవిడ్‌ నియంత్రణ తదితర అంశాలపై ఆయన మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశంలో సమీక్షించారు.

మద్యం అక్రమ తయారీ.. రవాణా, ఇసుక అక్రమాల్ని అరికట్టాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదేనని స్పష్టం చేశారు. వాటిని స్వయంగా తానే పర్యవేక్షిస్తానన్నారు. ‘మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకే ధరలు పెంచాం. మనం 25 శాతం పెంచి విక్రయాలు తగ్గించాలనుకుంటే.. దిల్లీలో ఏకంగా 70 శాతం పెంచారు. అందుకే మనం 75 శాతం పెంచాం. మద్యం దుకాణాలను ఇప్పటికే 20 శాతం తగ్గించాం. వచ్చే మూడు నెలల్లో మరో 13 శాతం తగ్గిస్తాం.

అప్పుడు అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో మొత్తం 33 శాతం దుకాణాలు తగ్గించినట్టవుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. ‘ధరలు పెంచడం, విక్రయాలు తగ్గించడం వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రాష్ట్రంలోకి రవాణా అయ్యేందుకు, రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని అడ్డుకోవలసిన బాధ్యత ఎస్పీలదే. ఇసుక మాఫియా ఉండడానికి వీల్లేదు’ అని ఆదేశించారు.

అర్హులకు ఇంటి స్థలం
‘27 లక్షల పేదలకు జులై 8న ఇళ్ల స్థలాల పట్టాలిస్తాం. మే 6 నుంచి 21 వరకు గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ఉంచండి. అర్హతలుండీ.. జాబితాలో పేరు లేనివారుంటే ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో చెప్పండి. మే 21 తర్వాత 15 రోజుల్లో పరిశీలనను పూర్తి చేసి జూన్‌ 7న తుది జాబితాను ప్రదర్శించండి. ఎవరూ మిగిలిపోవడానికి వీల్లేదు’ అని సీఎం పేర్కొన్నారు.
‘ఎంత నియంత్రించాలనుకున్నా కొవిడ్‌ ఎక్కడో చోట కనిపిస్తుంది. అది జీవితంలో భాగమవుతుంది. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో మనం ఇతర రాష్ట్రాలకన్నా భిన్నంగా పని చేయగలిగాం. దేశం మొత్తంలో నిర్ధరణ పరీక్షల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. కలెక్టర్లు, ఎస్పీలు చక్కగా పనిచేశారు’ అని సీఎం పేర్కొన్నారు.

సీఎం ఆదేశాలివీ..

  • ఇతర రాష్ట్రాల నుంచి లక్షకుపైగా వలస కూలీలు వస్తారని అంచనా. ప్రతి గ్రామంలో పది క్వారంటైన్‌ పడకలుండాలి. 11 వేలకుపైగా ఉన్న గ్రామ సచివాలయాల్లో మొత్తంగా కనీసం లక్ష మందికి క్వారంటైన్‌ సదుపాయం కల్పించాలి.
  • టెలిమెడిసిన్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ద్విచక్ర వాహనాన్ని, థర్మల్‌ బాక్సును ఉంచాలి. 24 గంటలూ ప్రిస్క్రిప్షన్‌ ప్రకారం మందులు వెళ్లాలి.
    కుటుంబ సర్వేలో గుర్తించిన వారిలో ఇంకా 5,281 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించాల్సి ఉంది.
  • తాగునీటి సమస్యపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. అనంతపురం, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలు ఎక్కువ. వీలైన చోట బోర్లు, లేదంటే ట్యాంకర్లతో నీరందించండి.
  • వలస వెళ్లినవారు తిరిగి వస్తున్నందున ఉపాధి పని దినాలను ఇంకా పెంచాలి.
  • గ్రామంలోకి అడుగు పెట్టినప్పుడు.. అభివృద్ధి చెందిన పాఠశాల, నిరంతరం ఏఎన్‌ఎం ఉండే విలేజ్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రం, జనతాబజార్‌, గ్రామ సచివాలయం ఉండాలి. అప్పుడే గ్రామాలపై మన ముద్ర కనిపిస్తుంది.
  • నాడు- నేడు కింద 15 వేలకుపైగా పాఠశాలల్లో చేపట్టిన పనులు జులై నెలాఖరుకు పూర్తి కావాలి.

ఇదీ చదవండి:

మద్యం షాపుల పర్యవేక్షణకు కంట్రోల్​ రూమ్​లు

Last Updated : May 6, 2020, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.