ETV Bharat / city

Animal Husbandry: అక్టోబర్​లో పశువులకు బీమా పథకం: జగన్​

Jagan on Animal Husbandry: ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన ఆర్గానిక్ పాల ఉత్పత్తిని అధికారులు ప్రోత్సహించాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రస్తుతం వస్తున్న పాలలో రసాయనాల మోతాదు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం.. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. పాడి రైతులకు తగిన అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలోనే గ్రామాల్లోని పశువులకూ వైద్య సేవలు అందించాలని సీఎం నిర్దేశించారు. అక్టోబరులో పశువులకు బీమా కల్పించే పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం జగన్​ వెల్లడించారు. పశువుల ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులు చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

CM Jagan
ముఖ్యమంత్రి వైఎస్ జగన్
author img

By

Published : Sep 27, 2022, 7:07 PM IST

Updated : Sep 27, 2022, 7:22 PM IST

Jagan on Animal Husbandry: పశు సంవర్థకశాఖపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పశువుల ఆస్పత్రుల్లో నాడు-నేడు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలో పశువులకు వైద్య సేవలు, తదితర అంశాలపై చర్చించారు. స్వచ్ఛమైన పాల ఉత్పత్తి కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రసాయనాలు ఎక్కువగా వాడుతున్నందున అవి జంతువుల్లోకి ఆహారం, వివిధ రూపాల్లో చేరి పాలల్లో వాటి అవశేషాలకు దారి తీస్తున్నాయని సీఎం తెలిపారు. అందువల్ల స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలన్నారు. ఆర్గానిక్‌ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర పద్ధతుల్లో ముందుకు వెళ్లాలన్నారు. అమూల్‌ ద్వారా రైతులకు మంచి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తక్కువ పెట్టుబడి, సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించే అంశంపై పరిశోధనలు చేసి వాటి ఫలితాలను రైతులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అమూల్‌ ద్వారా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఆలోచన చేయాలన్నారు. పాలలో రసాయనాల అవశేషాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలతోనే మంచి భవిష్యత్తు తరాలు నిర్మాణం అవుతాయని స్పష్టం చేశారు. పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.

జగన్​

ఈ శాఖలో ఉద్యోగాల భర్తీ: పశుసంవర్థక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సీఎం చర్చించారు. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీని పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి ఆర్బీకేల్లోనూ ఈ పోస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పశువులకు బీమా: పశువులకు బీమా కల్పించే అంశంపై చర్చించారు. పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశించారు. ఆడిట్‌ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు, రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు వస్తాయన్న సీఎం..ఇలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం తోడ్పడుతుందన్నారు. 80శాతం ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. వైయస్సార్‌ చేయూత, ఆసరా ద్వారా కొనుగోలు చేసిన పశువులకు బీమా ఉందా? లేదా? అనే అంశాన్ని మరోసారి పరిశీలించాలన్నారు.

పశువులకు వైద్యం: పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో రైతులకు తగిన అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. సాయిల్‌ డాక్టర్‌ మాదిరిగా కేటిల్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా అమలు చేయాలని సీఎం నిర్దేశించారు. ఏటా కూడా క్రమం తప్పకుండా పశువుల ఆరోగ్యాలను పరిశీలించి, పరీక్షించి వాటి వివరాలను పశు ఆరోగ్య కార్డుల్లో అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. వెటర్నరీ ఆస్పత్రుల్లో నాడు-నేడు కింద పనులు చేపట్టి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. మండలం ఒక యూనిట్‌గా తీసుకుని ప్రతిచోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక అమలు చేయాలన్నారు.

సంచార వైద్య సేవలు: వైయస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలపై నిరంతరం సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు. రెండో దశ కింద అక్టోబరులో మరిన్ని పశు అంబులెన్స్‌లు ప్రారంభానికి సిద్ధం చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలని జగన్​ సూచించారు. ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలోనే గ్రామాల్లోని పశువులకూ వైద్య సేవలు అందాలన్నారు. ఈమేరకు మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని కార్యాచరణ రూపొందించాలన్నారు. సిబ్బందిని నియమించుకుని వచ్చే సమావేశంలో దీని కార్యాచరణను తనకు నివేదించాలన్నారు.

పశుపోషణతో ప్రత్యామ్నాయ ఆదాయం: రైతులకు ప్రత్యామ్నాయం ఆదాయాలు పశుపోషణ ద్వారా వచ్చేలా చూడాలన్న సీఎం...పశుపోషణ విషయంలో వారికి అండగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల వ్యవసాయంతోపాటు, పశుపోషణ ద్వారా అదనపు ఆదాయాలు లభిస్తాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆసరా, చేయూత కింద లబ్ధిదారులైన మహిళలకు పశువుల పెంపకంపై వారికి తోడుగా నిలవాలని, బ్యాంకర్లతో మాట్లాడి వారికి రుణాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. ఆర్బీకేలలో, కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు. జంతువుల్లో లంపీ వైరస్‌ వ్యాపిస్తుందన్న సమాచారం వస్తోందని, దీని నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వైరస్‌ జంతువులకు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. సరిపడా మందులు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం జగన్​ ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 27, 2022, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.