ETV Bharat / city

13 నెలల్లో స్వరాజ్ మైదానంలో పనులు పూర్తి చేయాలి: సీఎం

విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్ పార్క్​ను అందంగా, ఆకర్షణీయంగా , ఆహ్లాదకరంగా నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అక్కడ ప్రతిష్టించనున్న అంబేడ్కర్‌ విగ్రహం ఎక్కడి నుంచి చూసినా స్పష్టంగా కనిపించాలని.. ఆ మేరకు విగ్రహం ప్రతిష్టించే స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు.

cm jagan reveiw on ambedkar statue in vijayawada swaraj ground

author img

By

Published : Sep 15, 2020, 3:37 PM IST

స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం.. నవంబరు 1వ తేదీన పనులు మొదలు పెట్టి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలని... విగ్రహం తయారీకి వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని నిర్దేశించారు. పనులు ప్రారంభించేలోగా ఆ స్థలంలో ఉన్న ఇరిగేషన్‌ ఆఫీసులు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ వెంటనే తరలించాలని ఆదేశించారు.

బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌లో 125 అడుగుల బి.ఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు, పార్క్‌ అభివృద్ధి, మాస్టర్‌ ప్లాన్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌తో పాటు, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్థిక, సాంఘిక సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. వివిధ సంస్థల ప్రతినిధులు పలు నమూనాలు ప్రదర్శించారు. విగ్రహంతో పాటు, పార్కు నిర్మాణానికి సంబంధించి.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో చూపారు.

అంబేడ్కర్ భారీ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే గ్రాండ్‌ లుక్‌ వస్తుందో దానిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అక్కడ ఒక కన్వెన్షన్‌ హాల్‌ కూడా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ముఖ్యమంత్రి... కన్వెన్షన్‌ సెంటర్, ఫుడ్‌ కోర్టు మాత్రమే కమర్షియల్‌గా ఉండాలని, వీటిపై వచ్చే ఆదాయం పార్క్‌ నిర్వహణకు ఉపయోగపడుతుందన్నారు. పార్కులో వీలైనంత వరకు కాంక్రీట్‌ నిర్మాణాలు తగ్గించాలని , మంచి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు.

ఇదీ చదవండి: అమరావతి భూములపై విచారణ... 12 మందిపై ఏసీబీ కేసు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.