ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన సీఎం... ఇవాళ కేంద్ర న్యాయశాఖ, ఎలక్ట్రానిక్స్ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. రాజధాని కార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని కేంద్రమంత్రి రవిశంకర్‌కు సీఎం జగన్ వివరించారు. హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయశాఖ తగిన చర్యలను తీసుకోవాలని కోరారు. శాసనమండలి రద్దు అంశాన్ని కూడా కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. కేంద్ర న్యాయశాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా దిశ చట్టం అమల్లోకి వచ్చేలా న్యాయశాఖ తరఫున ప్రక్రియను వేగవంతం చేయాలని రవిశంకర్ ప్రసాద్‌ను ముఖ్యమంత్రి కోరారు.
ముగిసిన సీఎం జగన్ దిల్లీ పర్యటన...
దిల్లీ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి చేరుకున్నారు. శాసన మండలి రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ, కర్నూలుకు హైకోర్టు, దిశ చట్టం వంటి అంశాలను రెండు రోజుల దిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు వివరించారు.