ETV Bharat / city

Jagananna vidya deevena: 'ప్రభుత్వం తరఫున.. విద్యార్థులకు ఇవ్వగలిగిన ఆస్తి చదువే..' - jagananna vidhya deevena funds latest news

ప్రభుత్వం తరఫున విద్యార్థులకు ఇవ్వగలిగిన ఆస్తి చదువే అని సీఎం జగన్​ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు గొప్పగా మార్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత నిధుల్ని సీఎం జగన్​ కంప్యూటర్‌ మీట నొక్కి విడుదల చేశారు.

jagananna vidya deevena
jagananna vidya deevena
author img

By

Published : Jul 29, 2021, 12:41 PM IST

Updated : Jul 29, 2021, 1:55 PM IST

‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత నిధుల్ని విడుదల చేసిన సీఎం జగన్​

‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ కంప్యూటర్‌ మీట నొక్కి 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్ల బోధన రుసుముల్ని విడుదల చేశారు. ఇవి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి.

'ఉన్నత చదువులు లేకపోతే పేదరికం ఎప్పటికీ పోదు. ఉన్నత చదువులతోనే పేదరికం పోతుంది. విద్యార్థులు అందరూ బాగా చదువుకోవాలన్నదే మా ఉద్దేశం. ప్రభుత్వం తరఫున విద్యార్థులకు ఇవ్వగలిగిన ఆస్తి చదువే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తాం. విద్యార్థుల తల్లితండ్రులను ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల భవిష్యత్తు గొప్పగా మార్చాలన్నదే మా లక్ష్యం'- సీఎం జగన్​

వందశాతం ఫీజు రీయింబర్స్​మెంట్​..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వంద శాతం ఫీజు రీఎంబర్సుమెంటు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, వైద్య, ఇంజినీరింగ్ విద్యార్ధులకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన ద్వారా అందుతోందని సీఎం అన్నారు. బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రతీ త్రైమాసికంలోనూ తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ పథకం ద్వారా 10.97 లక్షల మంది విద్యార్ధులకు మేలు జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం రూ.18,00 కోట్లు బకాయిలుగా పెట్టి వెళ్లిందని విమర్శించారు. ఈ ఏడాది ఏప్రిల్ 29న రూ.671 కోట్లు విద్యాదీవెన కింద చెల్లించామని.. ఇప్పటి వరకూ రూ.5,573 కోట్లు విద్యాదీవెన కింద విద్యార్ధుల తల్లుల ఖాతాలకు చెల్లించామని స్పష్టం చేశారు. తల్లితండ్రులు నేరుగా ఆయా కళాశాలలకు వెళ్లి వసతులపై నిలదీసే అవకాశముంటుందని తెలిపారు.

అమ్మ ఒడి, విద్యాకానుక, మనబడి నాడు - నేడు, సంపూర్ణ పోషణ తదితర పథకాల కింద విద్యారంగంపైనే 26 వేల 677 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని సీఎం వెల్లడించారు. ఏపీకి చెందిన విద్యార్ధులు గొప్ప వైద్యులుగా, ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా పేరు పొందాలని కోరుకుంటున్నట్టు సీఎం వ్యాఖ్యానించారు. అనంతరం జిల్లాల్లోని విద్యార్ధులు, తల్లితండ్రులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు.

జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా విద్యార్థులు చదివే ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ తదితర కోర్సుల ఫీజుల్ని నాలుగు విడతల్లో చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్‌ 19న మొదటి విడత ఇవ్వగా.. నేడు రెండో విడత చెల్లింపులు చేపట్టారు. డిసెంబరులో మూడు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగో విడత నిధులు విడుదల చేయనున్నామని వెల్లడించింది.

ఇదీ చదవండి:

Smart Townships: జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్​లో.. కుటుంబానికో ఇంటి స్థలం..!

Last Updated : Jul 29, 2021, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.