వ్యాక్సిన్ వచ్చే వరకు కొవిడ్‌తో కలిసి జీవించాల్సిందేనన్న ముఖ్యమంత్రి జగన్... నివారణ చర్యల పట్ల కలెక్టర్లు మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని, ఎవరూ ఆపలేమని అభిప్రాయపడ్డారు. వచ్చినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి... ఏం చేయాలన్నదానిపై అవగాహన కల్పించాలన్నారు. కొవిడ్ రాగానే వెంటనే మందులు తీసుకుంటే తగ్గిపోతుందని తెలిపారు.
ఇళ్లల్లో ప్రత్యేక గది లేకపోతే కొవిడ్ కేర్ సెంటర్లో ఉండొచ్చన్నారు. 85 శాతం మంది ఇళ్లలోనే ఉంటూ నయం చేసుకుంటున్నారని.. 15 శాతమే ఆసుపత్రులకు వస్తున్నారని వివరించారు. అందులోనూ 4 శాతం మంది మాత్రమే ఐసీయూలో ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్ర సరిహద్దులు తెరిచినందున రాకపోకలు పెరిగాయని..., అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులు వస్తున్నారని అలాంటి వారందరికీ వెంటనే పరీక్షలు చేయాలన్నారు.
ఇదీ చదవండి: