రాష్ట్రం మీద ప్రేమాభిమానాలు చూపించడానికి ప్రవాసాంధ్రులకు మంచి అవకాశం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కనెక్ట్ టూ ఆంధ్రా వెబ్ పోర్టల్‌ను సచివాలయంలో సీఎం ఆవిష్కరించారు. సీఎస్‌ఆర్ నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం వైబ్‌సైట్‌ను ప్రారంభించారు. ‘‘కనెక్ట్ టూ ఆంధ్రా’’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్ వైస్ ఛైర్మన్‌గా ఉంటారు. పోర్టల్ ప్రారంభం తర్వాత ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. గ్రామాల్లో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సాయం చేయొచ్చని సీఎం తెలిపారు. మెరుగైన రాష్ట్రం కోసం .. ఖండాంతరాల్లో ఉన్న వారంతా ముందుకొచ్చి సాయం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: విచారణకు హాజరుకాని ముఖ్యమంత్రి జగన్.. ఎందుకంటే..!