కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం.. ప్రజలకు అందించే మాస్కులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఒక్కొక్కరికీ 3 మాస్కుల చొప్పున ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం. . వాటి తయారీ బాధ్యతను స్వయం సహాయక బృందాలకు అప్పగించింది. మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను సీఎం జగన్ పరిశీలించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన మెప్మా అధికారులు.. మాస్కులు చూపించారు. పంపిణీకి అవసరమైన మాస్కుల తయారీ కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు తెలిపారు. ముందుగా రెడ్జోన్లలో పంపిణీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సత్వరమే తయారీ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరికీ 3 మాస్కుల చొప్పున ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు.
ఇదీ చదవండి: