ETV Bharat / city

'ప్రజలకు చంద్రబాబు చేసిన మేలేంటి?.. ఆయన చేసిన పాపాలు వెంటాడుతున్నాయి' - undefined

CM Jagan on Chandrababu: ‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మేలేమిటి అని ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం ఒక్కటే గుర్తుకు వస్తుందని జగన్​ విమర్శించారు. 3 ప్రాంతాల సమాన అభివృద్ధి వారికి పట్టదని జగన్​ వ్యాఖ్యానించారు.

jagan on cbn
jagan on cbn
author img

By

Published : Mar 11, 2022, 5:52 AM IST

Updated : Mar 11, 2022, 6:26 AM IST

‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మేలేమిటి? ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా?’ అని ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం ఒక్కటే గుర్తుకు వస్తుందని విమర్శించారు. ఎన్నికల హామీలకు తెదేపా ఏం విలువ ఇచ్చిందో, తామెంత విలువ ఇస్తున్నామో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ.. ‘34 నెలలు ఎలా పాలించాం? ఎన్నికల హామీలు అమలు చేశామా? లేదా? అనేందుకు సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థలు, ఇతర ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. కొవిడ్‌తో కష్టాలెదురైనా జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తీర్పునిచ్చారు’ అని వెల్లడించినట్లు ఈనాడు పత్రికలో ప్రచురితమైంది.

ప్రజలు నష్టపోతున్నారని తెలిసినా..

‘రాజధానిని వికేంద్రీకరిస్తామంటే చంద్రబాబుకు పట్టదు. తన భూములు, తనవారి భూములు, వాటి ధరలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోరు. ప్రజా ప్రభుత్వానికి, ప్రజల సభ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ కోర్టులోనైనా తీర్పు వస్తే సంతోషించేవారు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబే. మనం చేస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణ కావాలంటున్నారు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటారు. కుప్పం రెవెన్యూ డివిజన్‌ చేయాలని చంద్రబాబు అడుగుతున్నారు. తన పాలనలో చేయకుండా మనల్ని అడుగుతున్నారంటే ఎవరికి ఎంత విజన్‌ ఉందో ప్రజలకు అర్థమవుతుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు.

ఏ గ్రామాన్నైనా తీసుకుని పోల్చండి

‘రాష్ట్రంలో ఏ గ్రామాన్నైనా తీసుకుని 2014-19 వరకు, 2019-22కి మధ్య ఒక్కసారి పోల్చి చూడండి. కుప్పం పురపాలక, నియోజకవర్గంలో ఎవరి పాలన బాగుందో ప్రజలను అడగండి. గత ప్రభుత్వంలో పార్టీ, కులం, మతం చూడకుండా ఏ పథకాన్నైనా అమలు చేశారా? లంచం లేకుండా ఒక్క పథకాన్నైనా ఇచ్చారా? ప్రజలకు కావాల్సింది జన్మభూమి కమిటీలా? పారదర్శకమైన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థా? ఒకటో తేదీనే పింఛను ఇవ్వడంపై చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా? సాధారణ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పింఛను రూ.వెయ్యి. ఈ రోజు రూ.2,500 ఇస్తున్నాం. చంద్రబాబుకు గ్రామమంటే గౌరవం లేదు’ అని విమర్శించారు.

ప్రభుత్వ బడులను చంపాలని చూశారు

‘ప్రభుత్వ బడులను చంపేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇంకో ఐదేళ్లుంటే అన్ని మూసేసేవారు. పేద పిల్లలు తెలుగు మాధ్యమంలో, తమ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవాలన్నది మంచిదా? అందరికీ ఉచితంగా ఆంగ్ల మాధ్యమం అందిస్తున్న మా విధానం మంచిదా? అని అడుగుతున్నా. ప్రభుత్వ బడులకు వైభవానికి కష్టపడుతున్నాం’ అని జగన్‌ పేర్కొన్నారు.

జెండాలోనే గుడిసె ఉంది..

‘తెదేపా జెండాలోనే గుడిసె ఉంటుంది. పేదలు గుడిసెలోనే ఉండాలని కోరుకునే మనస్తత్వం వారిది. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలిచ్చాం. ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే పుట్టగతులుండవని, ఇప్పుడు వచ్చిన 23 సీట్లు రావనే భయంతో కోర్టులకు వెళ్తున్నారు. రోజు ఏదో ఒక సంఘటనను తీసుకొని ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా పొగ వేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఉద్యోగుల సంతృప్తి స్థాయిని తీసుకొని జీతాలు పెంచగలిగినంతా పెంచాం. 34 నెలల్లో 6.03 లక్షల ఉద్యోగాలు కల్పించాం’ అని సీఎం వెల్లడించారు.

ఆర్థిక అరాచకం అంటారా?

‘రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారం చేస్తున్నారు. 2014 నాటికి రాష్ట్రానికి రూ.1,20,556 కోట్ల అప్పులుంటే ఐదేళ్లలో అవి రూ.2,68,225 కోట్లకు చేరుకున్నాయి. చంద్రబాబు చెల్లించకుండా దాదాపు రూ.39వేల కోట్లు వదిలేశారు. ప్రభుత్వ గ్యారంటీపై 2014 నాటికి చేసిన అప్పులు రూ.14,028 కోట్లయితే 2019కి మరో రూ.58వేల కోట్లకు చేరాయి. విద్యుత్‌ సంస్థల పంపిణీకి సంబంధించిన బకాయిలు 2014కు రూ.2,893 కోట్లుంటే 2019కి రూ.21,540 కోట్లకు పెరిగాయి. దీన్ని ఆర్థిక వ్యవస్థ అంటారా? ఆర్థిక అరాచకం అంటారా? రాష్ట్రంపై ఇంత భారం మోపి ప్రజలకు చేసిన మేలేమీ లేదు. అంతా అవినీతికే పోయింది. అదే మనం చేసిన అప్పు ప్రజల జేబుల్లోకి వెళుతోంది. చంద్రబాబు పాపాలు మనల్ని వెంటాడుతున్నాయి. పాపాలు ఆయనవి. ప్రాయశ్చిత్తం మనది’ అని విమర్శించారు.

అందరికీ ఆ మందులు లభించాలి..

‘అధికారం పోయి వెయ్యి రోజులు అయిన సందర్భంగా రగిలిపోతున్న చంద్రబాబు, దాని అనుబంధ సంస్థలు, ఆయన కోసం వేర్వేరు సంస్థల్లో అహర్నిశలు కష్టపడుతున్న వారికి ట్యామ్‌ 40 ట్యాబ్లెట్లు, జెల్యూసిల్‌ సిరప్‌, ఈనో విరివిగా లభించాలని కోరుకుంటున్నా. ప్రజలందరి చల్లని దీవెనలు, దేవుడి దయ మన ప్రభుత్వంపై కలకాలం ఉండాలని ఆశిస్తున్నా’ అని జగన్‌ పేర్కొన్నారు.

గవర్నర్‌ను అవమానించారు..

ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ను తెదేపావారు ఎలా అవమానించారో చూశాం. దాదాపు దాడి చేసినంత పని చేశారు. గవర్నర్‌ వెళ్లిపోతున్నప్పుడు లాబీల్లోనూ అతి సమీపానికి వచ్చి గవర్నర్‌ గోబ్యాక్‌, డౌన్‌డౌన్‌ అంటూ తెదేపావారు నినదించారు. ఇవన్నీ చూస్తుంటే రాజ్యాంగమంటే వారికెంత కంటగింపో అర్థమవుతుంది. గవర్నర్‌ ప్రసంగంలో ప్రభుత్వ పాలనను ప్రస్తావించడం కొత్త కాదు. ఏవైనా అంశాలపై విభేదించాలనుకుంటే ప్రతిపక్ష నాయకుడికి సమయం ఇచ్చినప్పుడు మాట్లాడాలి’ అని జగన్‌ అన్నారు.

  • ఇదీ చదవండి:

AP Budget: సుమారు రూ.2.50 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ !

Last Updated : Mar 11, 2022, 6:26 AM IST

For All Latest Updates

TAGGED:

jagan on cbn
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.