ETV Bharat / city

"పోలవరం నిధులు... ప్రత్యేక హోదాపై పట్టుబట్టండి"

విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం పార్లమెంట్ వేదికగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైకాపా నిర్ణయించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, వెనుకబడిన జిల్లాలకు నిధులను సాధించే దిశగా పోరాడాలని వైకాపా ఎంపీలను ముఖ్యమంత్రి ఆదేశించారు.

cm jagan
author img

By

Published : Nov 16, 2019, 6:13 AM IST

మీడియాతో వైకాపా లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి

ఈనెల 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైకాపా ఎంపీలకు ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో దిశానిర్దేశం చేశారు. పోలవరం, రెవెన్యూలోటు సహా విభజన హామీల అమలు పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు సీఎం వివరించారు. ప్రత్యేక హోదా అంశంపై గళం విప్పాలని సీఎం జగన్‌ ఎంపీలకు స్పష్టం చేశారు. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీ వైకాపా అని.. ఆ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల సాధనకోసం వినియోగించాలని సీఎం సూచించారు. పార్లమెంట్​లో ఎంపీలు ప్రస్తావించాల్సిన 10 అంశాలను ముఖ్యమంత్రి చెప్పారు. వాటిలో కొన్ని..

పోలవరం
పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.11, 800 కోట్లు ఖర్చుచేస్తే అందులో రూ.8,577 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇంకా రూ. 3,222 కోట్లు రావాలి. వచ్చే జూన్‌ నాటికి కాఫర్‌ డ్యాం పూర్తవుతుంది. అప్పుడు 41.5 మీటర్ల వరకూ నీరు నిల్వ ఉండటం వల్ల సంబంధిత గ్రామాలు ముంపునకు గురవుతాయి. అందువల్ల ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల కోసం రూ.10వేల కోట్లు, అలాగే నిర్మాణ పనులకోసం రూ.6 వేల కోట్లు ఇచ్చేందుకు ఒత్తిడి తేవాలి. ఇవేకాక పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,549కోట్లకు కేంద్రం ఆమోదం తెలపాలి.

రెవెన్యూ లోటు

రాష్ట్ర విభజన నాటికి కాగ్‌ లెక్కల ప్రకారం 22, వేల 948.76 కోట్ల లోటు ఉందని తేల్చారు. ఇప్పటివరకూ 3,979 కోట్లు ఇచ్చారు. ఇంకా రూ.18,969 కోట్లు విడుదల చేయాలని ప్రస్తావించాలి.

ఇళ్లు
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు 12 లక్షల ఇళ్లను మంజూరుచేయాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు సీఎం సూచించారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకోసం కేంద్ర ప్రభుత్వం విధించిన అర్హతలు కఠినతరంగా ఉన్నాయని ఎంపీలు ప్రస్తావించారు. అర్హతలను మార్చాలంటూ కేంద్రానికి లేఖ రాద్దామని ఎంపీలకు వైఎస్ జగన్ చెప్పారు.

రాష్ట్రానికి కొత్తగా 7 మెడికల్‌ కాలేజీల కేటాయింపునకు అనుమతిని సాధించాలని ఎంపీలకు చెప్పారు. రామాయపట్నంలో నిర్మించ తలపెట్టిన పోర్టుకు కేంద్రం సహాయాన్ని కోరాలని, ట్రైబల్‌ యూనివర్శిటీని విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో ఏర్పాటుకు మార్పు చేసే అంశంపై ఆమోదం కోసం ప్రయత్నం చేయాలని నిర్దేశించారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలంటూ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి గట్టిగా పనిచేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

Intro:Body:

ap_vja_07_16_ysrcp_mps_meeting_over_all_pkg_3068069_1511digital_1573842392_1060

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.