అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరుకానున్నారు. సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లు, ఈడీ వేసిన 5 అభియోగపత్రాలపై విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 8 గంటల 50 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లనున్న సీఎం... పదిన్నర గంటలకు కోర్టుకు చేరుకుంటారు. విచారణ పూర్తిచేసుకొని పదకొండున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరుగు పయనమవుతారు. ముఖ్యమంత్రి అయ్యాక అక్రమాస్తుల కేసు విచారణకు జగన్ హాజరవుతుండటం ఇది రెండోసారి. సీబీఐ, ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను కోర్టు గతంలో తోసిపుచ్చింది. సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ... జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టులో ఈ నెల 12న విచారణ జరగనుంది.
ఇదీ చదవండీ...