సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని పొడిగించేందుకు ముఖ్యమంత్రి జగన్(cm jagan) అంగీకరించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ విజ్ఞప్తి మేరకు... బ్యాచిలర్ అకామిడేషన్(accommodation)ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇంకా పూర్తిగా రాని ఉద్యోగుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వసతిని 2022 ఏప్రిల్ వరకూ పొడిగించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్... సాధారణ పరిపాలన శాఖను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం(cm office) సమాచారం పంపించింది.
ఆక్టోబరు 31 నుంచి ఉచిత వసతి గడువు నిలిపివేస్తామంటూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేయటంతో ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి జగన్ ను సంప్రదించాయి. దీంతో మళ్లీ ట్రాన్సిట్ అకామిడేషన్ ను ఆరు నెలల పాటు పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నట్టు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు.
ఇదీచదవండి.