రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. వచ్చే ఖరీఫ్ నాటికి 11 వేల 158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయంలో నూతన విధానాలను ఆవిష్కరించేందుకు వర్క్‌షాపుల ఏర్పాటు చేస్తామన్నారు.
'రైతు భరోసా కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు, ఈ క్రాఫ్‌పై అవగాహన కల్పించే విధంగా అధికారులకు ఆదేశాలిస్తాం. పంటలు వేయడానికి ముందే కనీస మద్దతు ధరలు ప్రకటిస్తాం. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రూపాయితో ఈ క్రాప్‌లో నమోదు చేసుకుంటే చాలు... రైతుల ఇన్సూరెన్స్ ప్రీమియం కింద రూ.2100 కోట్లను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతుల కోసం వైఎస్సార్ పేరుతో వడ్డీలేని రుణాలను అందిస్తున్నాం' అని సీఎం జగన్ తెలిపారు.
ఇదీ చదవండి: