ETV Bharat / city

HC adjourned On Movie ticket Price case: టికెట్ ధరల ఉత్తర్వులపై సర్కారు అప్పీలు

movie tickets prices at ap high court
సినిమా టికెట్ల ధరల తీర్పుపై అప్పీల్‌కు ఏపీ ప్రభుత్వం
author img

By

Published : Dec 15, 2021, 12:27 PM IST

Updated : Dec 16, 2021, 4:56 AM IST

12:25 December 15

AP High Court adjourned On Movie ticket Price Case: సినిమా టికెట్ల ధరలు.. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన ప్రభుత్వం.. విచారణ నేటికి వాయిదా

AP HC adjourned On Movie ticket Price case: సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర హోంశాఖ ఈ ఏడాది ఏప్రిల్ 8 న జారీచేసిన జీవో 35 ను సస్పెండ్ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది . హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఈఆప్పీల్ వేశారు. నిన్న హైకోర్టు ప్రారంభ సమయంలో ఏజ్ ఎస్ శ్రీరామ్ అప్పీల్ గురించి ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం . సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణకు మొదట అనుమతిచ్చింది . అయితే ప్రభుత్వం వేసిన అప్పీల్లో సింగిల్ జడ్జి ఉత్తర్వుల ధ్రువీకరణ ప్రతి అందుబాటులో లేని కారణంగా విచారణను నేటికి వాయిదా పడింది. థియేటర్ యాజమాన్యాలు వచ్చినట్లు టికెట్ ధరలను నిర్ణయించుకునే ప్రమాదం ఉందని అప్పీల్లో పేర్కొన్నారు . సామాన్యుడిపై భారం పడుతుందన్నారు . గతంలో ఇదే జీవోను సవాలు చేస్తూ వేసిన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు సింగిల్ జడ్జి నిరాకరించారని తెలిపారు .

ఇదీ చదవండి..

movie ticket prices increase: సినిమా టికెట్ల ధరల పెంపునకు గ్రీన్​సిగ్నల్​.. ఎంతంటే...?

Last Updated : Dec 16, 2021, 4:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.