సినిమా థియేటర్లకు మళ్లీ కళ వచ్చింది. కొవిడ్‌తో 9 నెలలు ఇంటికే పరిమితమై, వినోదానికి దూరమైన ప్రేక్షకులు... హాళ్ల ప్రారంభంతో ఆనందంతో గంతులేస్తున్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి సినిమా చూస్తూ సందడి చేస్తున్నారు. విశాఖలో అన్ని థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. జిల్లాలో వందకు పైగా చిన్నా చితక థియేటర్లు ఆటలు మొదలు పెట్టాయి. ఇన్ని రోజులు సినిమాకు దూరమైనా... ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదని థియేటర్ల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా హాళ్లు ప్రారంభం కావటంతో ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు. ఇన్ని రోజులు పెద్ద స్క్రీన్ మజాను కోల్పోయామని... థియేటర్లు తెరుచుకోవడం సంతోషకరమని అంటున్నారు. ఐతే కొవిడ్ నిబంధనల అమలు పేరిట టికెట్ ధర పెంచడం సరికాదని అంటున్నారు. థియేటర్లలో కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారు. సీట్ల మధ్య దూరం, శానిటైజేషన్, సినిమాకు వచ్చిన వారంతా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి