పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్‌కు సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు. రెండు నెలల క్రితం ఓ టీవీ ఛానల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారనే ఆరోపణలపై మంగళగిరి సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కరోనాపై పోరులో వైద్యులకు పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్లుగా గంగాధర్ మాట్లాడారని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ డా.సి.వరసుందరం ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఈ నెల 30న విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని విచారణాధికారి ఆర్.రామచంద్రరావు నోటీసులు ఇచ్చారు.
ఇదీ చదవండి:
అనుమతులిచ్చిన అధికారులను ఈ కేసులో ఎందుకు చేర్చొద్దు?:హైకోర్టు