ETV Bharat / city

రామోజీ ఫిల్మ్ సిటీలో కేక్ మిక్సింగ్... 30 కిలోలు... 8 రకాల డ్రైఫ్రూట్స్‌తో - christmas cake mixing celebration at dolphin hotel ramoji film city

క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో శ్రీకారం చుట్టారు. వేడుకల కోసం కేక్‌ను సిద్ధం చేసేందుకు డాల్ఫిన్‌ హోటల్స్‌ ఆధ్వర్యంలో కేక్‌ మిక్సింగ్‌ చేశారు. ఇలా తయారుచేసిన కేక్‌ను క్రిస్మస్‌, నూతన సంవత్సరం సందర్భంగా అతిథులకు అందజేయనున్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో కేక్ మిక్సింగ్
రామోజీ ఫిల్మ్ సిటీలో కేక్ మిక్సింగ్
author img

By

Published : Nov 5, 2021, 8:40 PM IST

రామోజీ ఫిల్మ్ సిటీలో కేక్ మిక్సింగ్... 30 కిలోలు... 8 రకాల డ్రైఫ్రూట్స్‌తో

రామోజీ ఫిల్మ్‌ సిటీలో కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని... డాల్ఫిన్‌ హోటల్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేడుకల కోసం కేక్‌ను సిద్ధం చేసేందుకుగానూ... డ్రై ఫ్రూట్స్‌, ఇతర ద్రవాలను హోటల్‌ సిబ్బంది మిక్స్‌ చేశారు. 8 రకాలైన 30 కిలోల డ్రైఫ్రూట్స్‌ను వివిధ రకాల ద్రవాలతో 45 రోజుల పాటు కలియబెట్టనున్నారు. అనంతరం తయారైన కేక్‌ను క్రిస్మస్‌, నూతన సంవత్సరం సందర్భంగా అతిథులకు అందజేయనున్నారు.

గత ఏడాది కరోనా కారణంగా సందడి బాగా తగ్గగా... ఈ సారి సాధారణ పరిస్ధితులు నెలకొనడం, అతిథుల రాకపోకలు పెరగడంతో కేక్ మిక్సింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు సిబ్బంది తెలిపారు.

'అన్ని రకాలు డ్రై ఫ్రూట్స్​ తీసుకున్నాం. లిక్కర్​లో ప్రాపర్​గా సోప్​ చేయబోతున్నాం. 45 రోజుల పాటు. ప్రతీ సంవత్సరం సెలబ్రేట్​ చేస్తాం. కొవిడ్​ తర్వాత ఉల్లాసంగా చేశాం. 45రోజుల తర్వాత వీటితో కేక్​ చేస్తాం. క్రిస్మస్​ కోసం. కేక్​ మిక్సింగ్​ వల్ల మంచి కేక్​కు ప్లేవర్ వస్తుంది.'

- శివకుమార్‌, డాల్ఫిన్‌ హోటల్‌ చెఫ్‌

ఇదీ చదవండి : Navi Officers Meet CM: సీఎం జగన్​తో నేవీ అధికారుల మర్యాదపూర్వక భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.