చైనాకు చెందిన ఆటబొమ్మల తయారీ సంస్థ పాల్స్ పుష్ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏపీలో బొమ్మల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పాల్స్ పుష్ సంస్థ ఆసక్తిగా ఉందని మంత్రికి తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ టాయ్ మ్యానుఫాక్చరింగ్ బోర్డును ఏర్పాటు చేస్తే వాణిజ్యం, పెట్టుబడులకు అనువుగా ఉంటుందని మంత్రికి సూచించారు.
ఫ్యాబ్రిక్, స్ట్రిచ్చింగ్ వంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉపాధి అవకాశాలుంటాయని చైనా ప్రతినిధులు తెలిపారు. చైనా నుంచి దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇక్కడే తయారీ చేయడానికి గల అవకాశాలపై మంత్రి మేకపాటి చర్చించారు. పెట్టుబడులు, ఉపాధి కల్పన అంశాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి పాల్స్ పుష్ సంస్థ ప్రతినిధులను కోరారు.
ఇదీ చదవండి: