పురపాలక ఎన్నికల సందర్భంగా వచ్చేనెల 10న.. 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక, నగర పంచాయతీల పరిధిలో స్థానిక సెలవు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవును వర్తింపజేయాలని.. కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రభుత్వ శాఖల, పాఠశాలల భవనాలు వినియోగించుకోనున్నందున 14న ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించాలని ఆదేశించారు.
ఇదీ చదవండీ.. నయనానందం.. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తిరు కళ్యాణ మహోత్సవం