స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టు వద్ద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పతాక ఆవిష్కరణలో ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం అనేకమంది ప్రాణాలు అర్పించారని జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి గుర్తు చేశారు.
ఒకటిన్నర ఏడాది కాలంగా కోవిడ్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందన్నారు. కోర్టులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాయని వివరించారు. ఆన్లైన్ ద్వారా కోర్టు విధులు నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండీ.. CURFEW EXTEND: ఈనెల 21 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు