ETV Bharat / city

గ్రామ, సచివాలయ ఉద్యోగుల వేతనాలపై ప్రతిష్టంభన - chaos secratariate employee salaries

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల వేతనాలపై గందరగోళం నెలకొంది. వేతనాల బిల్లులు.. ఒప్పంద ఉద్యోగుల, ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలోని పొరుగు సేవలందిస్తోన్న ఉద్యోగులకు చెల్లించే 301, 302 ఖాతాల్లో ప్రవేశ పెట్టాలన్న పంచాయతీ రాజ్​ శాఖ ఆదేశాలతో ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపై తదుపరి ఆదేశాల కోసం సిబ్బంది ఎదురుచూస్తున్నారు.

గ్రామ, సచివాలయ ఉద్యోగుల వేతనాలపై ప్రతిష్టంభన

author img

By

Published : Dec 24, 2019, 4:27 AM IST

గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఒప్పంద ఉద్యోగుల, ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలోని పొరుగు సేవలందిస్తోన్న ఉద్యోగులకు చెల్లించే 301, 302 ఖాతాల్లో బిల్లులు పెట్టాలన్న పంచాయతీ రాజ్​ శాఖ ఆదేశాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధిక జిల్లాల్లో బిల్లులు పెట్టకుండా అధికారుల తదుపరి ఆదేశాల కోసం సిబ్బంది నిరీక్షిస్తున్నారు. అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 010 ఖాతాల్లో చెల్లించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ లోగడే ఆదేశాలు జారీ చేసింది.

అప్పుడలా.. ఇప్పుడిలా..

సచివాలయ ఉద్యోగులకు అక్టోబరు, నవంబరు వేతనాల కోసం అధికారులు బిల్లులు పెడుతున్నారు. అయితే 301, 302 ఖాతాల్లో బిల్లులు పెట్టేందుకు సిబ్బంది వెనకడుగు వేస్తున్నారు. ఈ విధానం ఒకసారి అమల్లోకి వస్తే మళ్లీ వెనక్కు రావడం కష్టమని వారు భావిస్తున్నారు. తదుపరి ఆదేశాలివ్వాలని పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను కోరుతున్నారు.

వారంలో పరిష్కారం

గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తలెత్తిన సమస్యలు వారంలో పరిష్కరిస్తామని పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:

'మంత్రి బొత్స సోదరుడు మా భూములు కబ్జా చేశారు'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.