ఏపీ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పేరేషన్ బోర్డు నియామకాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డిని ఛైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. అటు పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని బోర్డు ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆర్ధికశాఖ కార్యదర్శి సహా మత్స్యశాఖ, పర్యాటకశాఖ కమిషనర్లు, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ, ఏపీఎంఐడీసీఎల్ ఎండీని ఏపీ మారిటైమ్ ఇన్ఫ్ర్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.
ఇదీ చదవండి: రైతులు లబ్ధి పొందేలా చర్యలు తీసుకోండి: సీఎం జగన్