తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు.. చంద్రబాబునాయుడు నివాళి అర్పించారు. గుంటూరు జిల్లా వెంకటపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున ఎన్టీఆర్కు నివాళి అర్పించే సంప్రదాయాన్ని తెదేపా కొనసాగిస్తోంది. అక్కడి నుంచి ర్యాలీగా సభకు చేరుకున్నారు. ఆరునెలల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంటామని పార్టీ నేతలు తెలిపారు.
ఇవీ చదవండి..