ETV Bharat / city

Chandrababu: పార్టీలో కోవర్టులు ఉన్నారు.. అందరినీ ఏరిపారేస్తాం: చంద్రబాబు - చంద్రబాబు వార్తలు

chandrababu review with Kuppam leaders: పార్టీలో ఇకపై సమర్థులకే పట్టం కడతామన్నారు తెదేపా అధినేత చంద్రబాబు. రాష్ట్రస్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారని.. వారిని ఏరిపారేస్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు. స్థానిక నాయకుల అతి విశ్వాసం వల్లే కుప్పంలో ఓటమి పాలయ్యామని వ్యాఖ్యానించారు.

chandrababu
chandrababu
author img

By

Published : Dec 8, 2021, 10:21 PM IST

chandrababu review with Kuppam leaders: కుప్పం నుంచే పార్టీలో ప్రక్షాళన ప్రారంభిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పం మున్సిపాలిటీ అభ్యర్థులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారని వారిని ఏరిపారేస్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు. పార్టీలో ఇకపై సమర్థులకే పట్టం కడతామన్నారు. తనను మెప్పించడం కాదని ప్రజల్లోకి వెళ్లి పనిచేసే వారికే సముచిత స్థానం ఇస్తామన్నారు.

అధికారంలోకి రాగానే ఆరాచకశక్తులు చేసిన పనులను వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. స్థానిక నాయకుల అతి విశ్వాసం వల్లే కుప్పంలో ఓటమి పాలయ్యామన్న చంద్రబాబు.., వార్డుల వారీగా రహస్య నివేదికలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థులకు ఆదేశించినట్లు తెలిపారు. కుప్పంలో పార్టీ పటిష్టానికి సమర్థులైన నాయకులతో కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల రోజు మహిళల పోరాట పటిమకు చంద్రబాబు కితాబునిచ్చారు.

ఇదీ చదవండి:

IAF Chopper Crash: హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లావాసి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.