ETV Bharat / city

'ఉచిత ఇసుక విధానం తీసుకురావాలని డిమాండ్' - విజయవాడలో చంద్రబాబు దీక్ష

ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులకు అండగా.. ఈ నెల 14న నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. కార్మికులు చనిపోతున్నా... ప్రభుత్వంలో చలనం లేదని ఆయన మండిపడ్డారు. సీఎస్ ఆకస్మిక బదిలీ జగన్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన బిల్లుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమేనని చంద్రబాబు తెలిపారు.

babu
author img

By

Published : Nov 5, 2019, 8:03 PM IST

'ఉచిత ఇసుక విధానం తీసుకురావాలని డిమాండ్'

రాష్ట్రంలో ఇసుక కొరతతో 35 లక్షల మంది కార్మికులు రోడ్డునపడినా... ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వరదల పేరుతో ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆయన విమర్శించారు. ప్రతిరోజూ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో చంద్రబాబు పాల్గొన్నారు.

పాలించే వ్యక్తి మారితే రాష్ట్రం ఎలా అధోగతి పాలవుతుందో చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసేందుకే ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఆకస్మికంగా బదిలీ చేశారన్నారు.

రివర్స్ టెండరింగ్‌తో డబ్బు ఆదా చేశామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం... పోలవరం ఖర్చు పెంపుపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.. రాజధానిపై రోజుకో మాటతో బంగారుబాతు లాంటి అమరావతిని చంపేశారని చంద్రబాబు దుయ్యబట్టారు.

పార్టీ సంస్థాగత ఎన్నికలు డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని.. యువత, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.