ETV Bharat / city

'ప్రతి పేద కుటుంబానికి రూ.5వేల సాయం ప్రకటించాలి'

రాష్ట్రంలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ విజృంభిస్తున్న వేళ వీలైనన్నీ ఎక్కువ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. లాక్ డౌన్ తో ఇబ్బందిపడుతున్న ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని కోరారు. ఆక్వా రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

chandrababu on corona
chandrababu on corona
author img

By

Published : Apr 6, 2020, 1:47 PM IST

Updated : Apr 6, 2020, 4:23 PM IST

కరోనాతో ప్రజలంతా బాధపడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఐరోపా దేశాల్లో అత్యధికంగా పరీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారం రోజుల్లో 62 శాతం కరోనా కేసులు పెరిగాయని చెప్పారు. మన రాష్ట్రంలోనూ అత్యధికంగా ఒక్క వారంలోనే వెయ్యి శాతానికి కేసులు పెరిగాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో పరీక్షలు చాలా తక్కువ ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తించాలని... వాస్తవాలను దాచకూడదని సూచించారు. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని కోరారు.

'ప్రధాని ఇచ్చిన పిలుపును అందుకుని ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. మనం పరిశుభ్రంగా ఉంటూ... పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఒకరిని ఇంకొకరు తాకినప్పుడు కరోనా వస్తుంది. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. సామాజిక దూరంతోపాటు భౌతిక దూరం పాటించాలి'- చంద్రబాబు, తెదేపా అధినేత

కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని చెప్పారు. లాక్ డౌన్ తో పేదలు చాలా కష్టాలు పడుతున్నారని...వారిని ఆదుకునేందుకు తగిన కార్యాచరణను రూపొదించాలని కోరారు. మిగతా రాష్ట్రాల తరహా...రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు.

మీడియాతో తెదేపా అధినేత చంద్రబాబు

కరోనా వైరస్ పోరాడుతున్న వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు తగిన రక్షణ పరికరాలను అందించాలని చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవా సిబ్బందికి కావాల్సినవన్నీ ఇచ్చేలా చూడాలని వ్యాఖ్యానించారు.

'వరితో పాటు పండ్ల తోట్లను సాగు చేసిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కూలీల సమస్యలను పరిష్కరించాలి . ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించటం సరికాదు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి.' -చంద్రబాబు, తెదేపా అధినేత

ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయలను వైకాపా అభ్యర్థులు పంచడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల కోడ్, విపత్కర పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో అభివృద్ధి కార్యక్రమాలను ఎలా చేస్తారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రకటించే హెల్త్ బులెటిన్​ సరైన వివరాలతో ఉండటం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని అన్ని రాజకీయపక్షాలతో మాట్లాడుతున్నారని...కానీ రాష్ట్ర సీఎం అలాంటి ప్రయత్నం చేయడం లేదని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి

Last Updated : Apr 6, 2020, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.