వైకాపాను వదిలించుకోకపోతే రాష్ట్రానికి పట్టిన పీడ వీడదని...తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. తిరుపతి ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలన్న చంద్రబాబు..వైకాపా వచ్చాక ఏ వర్గానికి ఎంత మేర నష్టం జరిగిందనేది ప్రతీ మండలంలోనూ వివరించాలని సూచించారు.
సంఘటితంగా పోరాడాలి...
ఎలాంటి నేరం చేయకుండానే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాబలం ముందు నియంతలంతా తల వంచాల్సిందేనన్న ఆయన..రాష్ట్రాన్ని రావణకాష్టం చేయవద్దని హెచ్చరించారు. వైకాపా బాధితులంతా ఏకమై నిరంకుశ పాలనపై సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే గెలవలేమనేదే వైకాపా భయమని, బాధిత వర్గాలన్నీ ఏకమై ఓడిస్తారనే వెనుకంజ వేస్తున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనార్టీలలో వైకాపాపై తీవ్ర వ్యతిరేకత ఉందని అభిప్రాయపడ్డారు. అంతా కలసికట్టుగా రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్‌ను కాపాడుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు.
ఇదీ చదవండి