ఆంధ్రా బ్యాంకు భవితవ్యంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే చర్యలు అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి సంస్కరణలు పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచుతాయని ప్రశంసించారు. కానీ.. ఆంధ్రాబ్యాంక్ విలీనాన్ని తెలుగుప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రాబ్యాంక్ పేరు తెలుగువాళ్ల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని... తెలుగువాళ్ల నమ్మకం పెంచుతూ బ్యాంకు కూడా విశేష సేవలు అందించిందని గుర్తుచేశారు. విలీనం అనివార్యమైతే ఆంధ్రాబ్యాంక్ పేరునే కొనసాగించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ...