ETV Bharat / city

NRITDP website: ఎన్​ఆర్​ఐటీడీపీ వెబ్​సైట్​ను ప్రారంభించిన చంద్రబాబు - ఎన్​ఆర్​ఐటీడీపీ సెల్​

Chandrababu Launched NRITDP website: ఎన్​ఆర్​ఐటీడీపీ(www.nritdp.com) వెబ్​సైట్​ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్​లో లాంఛనంగా ప్రారంభించారు. విదేశాల్లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు, సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

nritdp website launched by  chandrababu
ఎన్​ఆర్​ఐ టీడీపీ వెబ్​సైట్
author img

By

Published : Apr 15, 2022, 8:42 PM IST

NRI TDP Website: వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగుదేశం పార్టీ అభిమానులు, సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు గానూ ఎన్​ఆర్​ఐటీడీపీ విభాగాన్ని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. అందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్​సైట్ www.nritdp.comను పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్​లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ వెబ్​సైట్ ద్వారా ఎన్​ఆర్​ఐల నుంచి పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1200 మంది కౌన్సిల్ మెంబర్స్​ని ఏర్పాటు చేయటంతోపాటు తెదేపా కేంద్ర కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ - ల్యాండ్ లైన్ నంబర్​ +918645350888, వాట్సాప్ నంబర్​ +918950674837 ను ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు తెలిపారు.

తెదేపా కార్యకర్తల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వటంతోపాటు.. ఏపీలో ఐటీ, టెక్నికల్ వంటి పలు ఉద్యోగ, ఉపాధిశిక్షణా కార్యక్రమాలను ఈ విభాగం నిర్వహించనుంది. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ప్రొసీజరల్ గైడ్ లైన్స్ ఇవ్వడంతోపాటు ఆపద సమయంలో సాయం అందించేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ పని చేస్తుంది. ఉక్రెయిన్​పై రష్యా యుద్ద సమయంలో ఉక్రెయిన్​లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి తరలించడంలో ఎన్​ఆర్​ఐ సేవలను చంద్రబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డా. వేమూరి రవి, రాజశేఖర్ చప్పిడితో పాటుగా పార్టీ అమెరికా కోఆర్డినేటర్ కోమటి జయరాం పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Lokesh: 'జగన్ పరిపాలనలో న్యాయస్థానాలకు సైతం రక్షణ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.