చంద్రబాబు నివాసంలో గేటుకు కట్టిన తాళ్లను పోలీసులు తొలిగించారు. బుధవారం ఉదయం చలో ఆత్మకూరుకు బయలుదేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులు ఆయన ఇంటి గేటును తాళ్లతో కట్టారు. సాయంత్రానికి తాళ్లను తొలిగించిన అనంతరం సెక్షన్ 151 కింద పోలీసులు నోటీసులు జారీచేశారు. 12 గంటల గృహ నిర్బంధం తర్వాత నోటీసులు జారీచేయడంపై తెదేపా తరఫు న్యాయవాదులు పోలీసులను ప్రశ్నించారు. నోటీసులలో కనీస సమాచారం లేదని.. అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాదుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పోలీసులు వెళ్లిపోయారు. నోటీసులు ఇవ్వకుండా నిర్బంధించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెదేపా ఆరోపించింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించారని తెదేపా పేర్కొంది.
ఇదీ చదవండి: