ఎన్నో సంప్రదింపులు జరిపి... నిరంతరం వెంటపడి లూలూ గ్రూప్‌ను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించామని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుతో విశాఖలో వేల ఉద్యోగాలు వచ్చి, ఆర్థిక అభివృద్ధి జరిగేదన్నారు. జగన్ ప్రభుత్వ తెలివితక్కువ నిర్ణయాల కారణంగా... తమ శ్రమంతా వృథా అయ్యిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
బాధ్యత లేని ఇలాంటి చర్యలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని చంద్రబాబు ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. లూలూ గ్రూప్సంస్థకు ఇలా జరిగినందుకు... చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.