ETV Bharat / city

రాజకీయ కక్షతోనే అమరావతిపై దుష్ప్రచారం: చంద్రబాబు

ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అమరావతి భూములపై ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెదేపాపై రాజకీయ కక్షతోనే అమరావతిపై వైకాపా దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

రాజకీయ కక్షతోనే అమరావతిపై దుష్ప్రచారం: చంద్రబాబు
రాజకీయ కక్షతోనే అమరావతిపై దుష్ప్రచారం: చంద్రబాబు
author img

By

Published : Sep 15, 2020, 4:37 PM IST

తెలుగుదేశం సీనియర్ నాయకులు, 175 నియోజకవర్గాల తెదేపా అభ్యర్థులు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దుర్మార్గుల పాలనలో మంచివాళ్లకు కలిగే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ దోపిడీకి ఇదే చివరి అవకాశం అన్న ఆరాటంతో వైకాపా బరితెగించిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల సహనానికి హద్దులు దాటిపోయి వైకాపా దుర్మార్గాలపై తిరగబడే పరిస్థితి వచ్చిందన్నారు.

ప్రజల ఆరోగ్యం, పేదల ఉపాధి వైకాపా ప్రభుత్వానికి లెక్కలేదని.. దళిత ఆడబిడ్డల మానానికి, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగేందుకు, మాట్లాడేందుకు హక్కు లేదని..., ప్రాథమిక హక్కులనే కాదు, జీవించే హక్కును కూడా కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అత్యంత కీలకమైనదని.. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనని గుర్తు చేశారు. అలాంటిది ప్రతిపక్షాన్ని అణిచేయాలని పోలీసులు చూడకూడదని హితవు పలికారు. ప్రశ్నించే గొంతును నొక్కేయాలని ప్రయత్నించకూడదని సూచించారు. పార్టీలకు అతీతంగా పోలీసు వ్యవస్థ పనితీరు ఉండాలన్నారు.

జంగారెడ్డిగూడెంలో నలుగురు దళిత యువకులపై దాడిని చంద్రబాబు ఖండించారు. ఏ మతం విశ్వాసాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని... భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. తెదేపా మత సామరస్యానికి కట్టుబడిన పార్టీ అని స్పష్టం చేశారు. అంతర్వేది సహా అన్ని దేవాలయాల్లో జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వ టెర్రరిజానికి బలైన తొలి వ్యక్తి కోడెల శివప్రసాద్‌ అన్న చంద్రబాబు.. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కోడెల వర్థంతి జరపాలని నేతలకు పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. సీఎన్‌జిపై 10శాతం పన్ను పెంచి ఆటో డ్రైవర్లపై భారం మోపారని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లకు 10 వేల రూపాయలిచ్చి 20 వేలు లాక్కోవడం హేయమని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: నీటిపై చిన్నారుల మృతదేహాలు.. అపస్మారక స్థితిలో తల్లి, మరో వ్యక్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.