ETV Bharat / city

మద్యం దుకాణాలు తెరవడం పెద్ద తప్పిదం: చంద్రబాబు

author img

By

Published : May 13, 2020, 4:38 PM IST

లాక్​డౌన్​తో ప్రధాని కరోనాను కట్టడి చేయగలిగారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ పొలిట్​బ్యూరో భేటీలో పలు అంశాలపై నేతలతో చర్చించారు.

chandrababu
chandrababu

విద్యుత్తు బిల్లులు నాలుగు రెట్లు పెంచడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన అధ్యక్షతన జరిగిన తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశంలో పలు అంశాలను చర్చించారు. తాము వ్యవస్థలను నిర్మిస్తే వైకాపా ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఈ సందర్బంగా చంద్రబాబు విమర్శించారు. వచ్చే 2 నెలలు కేసులు ఇంకా పెరుగుతాయనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. విపత్కర సమయంలో ప్రధాని రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

మద్యం దుకాణాలు తెరవడం పెద్ద తప్పిదంగా మారింది. వచ్చే రెండు నెలలూ కేసులు ఇంకా పెరుగుతాయనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొదట్లో క్వారంటైన్‌ సక్రమంగా అమలు చేయలేకపోయారు. లాక్‌డౌన్‌తో ప్రధాని కరోనాను కట్టడి చేయగలిగారు. నిబంధనల అమలులో కొన్ని రాష్ట్రాల్లో పొరపాట్లు జరిగాయి.

- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:

'ఆరోగ్య ఆసరా పథకంలో ఎలాంటి ఇబ్బందులుండొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.