శ్రీకాకుళంలో తెదేపా నేతల అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న మంత్రులు, వైకాపా నేతలను వదిలి తెదేపా నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, గౌతు శిరీషలను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ను చంద్రబాబు ఖండించారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు అని, పౌరుల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాస్తున్నారని మండిపడ్డారు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తామని మంత్రి సీదిరి అప్పల్రాజు చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన సర్దార్ గౌతు లచ్చన్నను అవమానించిన వైకాపా నేతలు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన తెదేపా నేతలను వెంటనే విడుదల చేయాలన్నారు.
ఇదీ చదవండి:
పలాసలో ఉద్రికత్త.. నిరసనకు తెదేపా పిలుపుతో నేతల గృహ నిర్బంధం