కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచిపోయిందని, మరో 2 ఏళ్ల లోపే ఎన్నికలు రావొచ్చని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వరి రైతులకు హెక్టారుకు 30 వేలు, హర్టికల్చర్, ఆక్వా రైతులకు హెక్టారుకు 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వైకాపా అమలు చేయాల్సింది భారత రాజ్యాంగమే కానీ.. రాజా రెడ్డి రాజ్యాంగాన్ని కాదని హితవు పలికారు.
బూతులు మాట్లాడకపోవడమే తన బలహీనత అనుకుంటే తప్పని... అదే తన బలమని అన్నారు. రైతుల సమస్యలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్దిష్ట హామీ ఇచ్చేంత వరకు అసెంబ్లీలో పోరాడతామన్నారు. తన జీవితంలో పోడియంలోకి వెళ్ళి మొదటిసారి సస్పెండ్ అయినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ప్రజా వేదిక కూల్చారని, అలాంటి చర్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాదా..? అని ప్రశ్నించారు.
కడపనే ముంచేశారు..
'అమరావతి ముంపు ప్రాంతం అని చెప్పే జగన్ .. కడపను ముంచేశారు. కడప జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. బుగ్గవంక గేట్లు ఒకేసారి ఎందుకు ఎత్తారు..? అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఎందుకు పనిచేయలేదు..? '- చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి