ETV Bharat / city

హత్యల వెనుక.. ఆ ఎమ్మెల్యే హస్తం : చంద్రబాబు - హత్యలు చేసిన వారిని ఉరితీయాలన్న చంద్రబాబు

Chandrababu: "ఆస్పత్రి నుంచి జల్లయ్య మృతదేహం ఎక్కడికి తరలించారో కూడా చెప్పరా?" అని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారని.. ఈ హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి హస్తం ఉందని ఆరోపించారు. ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు డిమాండ్​ చేశారు.

డీజీపీకి చంద్రబాబు లేఖ
డీజీపీకి చంద్రబాబు లేఖ
author img

By

Published : Jun 4, 2022, 2:19 PM IST

Updated : Jun 4, 2022, 7:17 PM IST

పల్నాడులో హత్యకు గురైన తెదేపా కార్యకర్త జల్లయ్య మృతదేహాన్ని.. ఆస్పత్రి నుంచి ఎక్కడికి తరలించారో కూడా చెప్పరా? అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిలదీశారు. సొంత గ్రామంలో దహన సంస్కారం చేసే అవకాశం కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారని.. ఈ హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

మరోవైపు జల్లయ్య అంత్యక్రియలకు వెళ్తున్న తెదేపా నేతల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడలేని పోలీసులు.. అంత్యక్రియలకు వెళ్తున్న వారిని అరెస్ట్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. కాగా.. జల్లయ్య కుటుంబానికి తెదేపా తరఫున రూ.25 లక్షల ఆర్థికసాయాన్ని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు.

డీజీపీకి చంద్రబాబు లేఖ: జల్లయ్య హత్య, పోలీసుల వైఖరిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా పోలీసులే జల్లయ్య మృతదేహాన్ని బలవంతంగా ఎలా తరలించారని లేఖలో ప్రశ్నించారు. కుటుంబ సభ్యులను సైతం పోలీసులు బలవంతంగా బస్సుల్లో అక్కడికి తీసుకువెళ్లారన్నారు. జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా తెదేపా నేతలను పోలీసులు అరెస్టులతో అమానవీయంగా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే అసలు ఈ హత్య జరిగేది కాదన్నారు. 2019 తరువాత ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారని మండిపడ్డారు. అందులో నలుగురు యాదవ సామాజికవర్గం వారే ఉన్నారన్నారు. హంతకులకు మరణ శిక్ష విధించేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

డీజీపీకి చంద్రబాబు లేఖ
డీజీపీకి చంద్రబాబు లేఖ

ఇవీ చదవండి:

Last Updated : Jun 4, 2022, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.