కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ... వైద్యులు సూచించిన ఐదు దశలను పాటించాలని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చంద్రబాబు సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ప్రభుత్వం ఆలస్యంగా క్వారంటైన్ చేసిందని, ముందే చేసుంటే తీవ్రత పెరిగేది కాదని తెలిపారు. కరోనా వైరస్ కట్టడి చేయగలిగితే దేశ ఖ్యాతి మరింత పెరుగుతుందని చెప్పారు.
ఇవీ చదవండి: కరోనాపై జాతినుద్దేశించి నేడు మోదీ ప్రసంగం