విభజన బాధల నుంచి పుట్టిన ఆలోచనే అమరావతి అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులు 200 రోజులుగా చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని తెలిపారు. రైతుల స్ఫూర్తికి తాను వందనం చేస్తున్నానంటూ.. ఈ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం నిలిపివేయడం ఒక జాతీయ విషాదం అని చంద్రబాబు అభివర్ణించారు.
మూడు రాజధానుల ఏర్పాటు అనేది తుగ్లక్ నిర్ణయమన్న చంద్రబాబు.. అద్భుత రాజధానిని నిర్మించుకునే అవకాశాన్ని వైకాపా ప్రభుత్వం దూరం చేసిందని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్ర పురోభివృద్ధికి బలమైన చోదకశక్తిగా నిలిచేదని పేర్కొన్నారు. సీఎం జగన్ సొంత ప్రయోజనాల కోసమే 3 రాజధానుల ఆలోచన అని చంద్రబాబు ఆరోపించారు.
ఇదీ చదవండి: