రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉండటం విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుపై మరింత భారం మోపుతోందని దుయ్యబట్టారు.
'వరుస విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతే.. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో బైఠాయించే వరకు పంటబీమా ప్రీమియం కట్టకపోవటం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పరిహారం అడిగితే సభలో తెదేపా సభ్యులపై దాడికి తెగబడ్డారు. ఇకనైనా తీరు మార్చుకుని పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలి. పంట కొనుగోళ్లలో అవినీతికి స్వస్తి చెప్పి రైతు బకాయిలను తక్షణమే చెల్లించాలి. విపత్తు పరిహారం, బీమా, ఇన్ పుట్ సబ్సిడీలు సకాలంలో అందించి రైతులలో భవిష్యత్తుపై భరోసా పెంచాలి. అన్నంపెట్టే రైతన్నలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది తెదేపా ఆకాంక్ష.'- చంద్రబాబు
ప్రజా రాజధాని అమరావతి ప్రాంత రైతులు 372 రోజులుగా నిద్రాహారాలు మాని ఉద్యమిస్తున్నా.. పాలకులకు పట్టట్లేదని చంద్రబాబు ఆక్షేపించారు. 110 మంది అమరావతి రైతులు అమరులయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
-
రైతు సోదరులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. పదిమందికి అన్నంపెట్టే రైతన్నలంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ లో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటం, రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో ఉండటం విషాదకరం(1/5)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">రైతు సోదరులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. పదిమందికి అన్నంపెట్టే రైతన్నలంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ లో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటం, రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో ఉండటం విషాదకరం(1/5)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 23, 2020రైతు సోదరులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. పదిమందికి అన్నంపెట్టే రైతన్నలంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ లో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటం, రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో ఉండటం విషాదకరం(1/5)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 23, 2020
ఇదీ చదవండి: 'సచివాలయాలు మరింత మెరుగ్గా పని చేయాలి'